డిసిసి ప్రధాన కార్యదర్శిగా తిమ్మాపురం మహేందర్ రెడ్డి

డిసిసి ప్రధాన కార్యదర్శిగా తిమ్మాపురం మహేందర్ రెడ్డి

తెలంగాణ కేసరి, వెబ్ డెస్క్ , రామన్నపేట, మార్చి 19

మండలంలోని వెల్లంకి గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ తిమ్మాపురం మహేందర్ రెడ్డి జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. గురువారం టీపీసీసీ అధ్యక్షుడు బి.మహేష్ కుమార్ గౌడ్ ప్రకటించిన డిసిసి కమిటీలో తిమ్మాపురం మహేందర్ రెడ్డికి ప్రధాన కార్యదర్శిగా అవకాశం దక్కింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ..పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.తన నియామకానికి సహకరించిన ఎంపి సామల కిరణ్ కుమార్ రెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ,మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సిరిగిరెడ్డి మల్లారెడ్డి, జిల్లా నాయకులు గంగుల వెంకట్ రాజి రెడ్డి లకు కృతజ్ఞతలు తెలిపారు.

WhatsApp Join Now
Youtube Subscribe