ఆర్డీఓ హామీతో దీక్ష విరమణ

ఆర్డీఓ హామీతో దీక్ష విరమణ

నిరవధిక నిరాహార దీక్షలకు మద్దతుగా నిలబడిన ప్రజా సంఘాలకు ధన్యవాదాలు

ఆసుపత్రికి నిధులు కేటాయించకుంటే మరో పోరాటానికి సిద్ధం కావాలి

సిపిఐ(ఎం) నాయకులు జల్లెల పెంటయ్య, బొడ్డుపల్లి వెంకటేశం

తెలంగాణ కేసరి, వెబ్ డెస్క్, రామన్నపేట, మార్చి 19

రామన్నపేట ప్రభుత్వ ఆసుపత్రిని వందపడకలుగా మార్చి బడ్జెట్లో నిధులు కేటాయించాలని సిపిఐ(ఎం) చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షలకు సంఘీభావం తెలిపి, మద్దతుగా నిలబడిన వారందరికీ ధన్యవాదాలు అని, ఆసుపత్రి సాధన కోసం జరిగే భవిష్యత్తు పోరాటంలో రాజకీయాలకతీతంగా అందరూ ఏకం కావాలని, ప్రజారోగ్యం కోసం పోరాటం చేయాలని సిపిఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు జల్లెల పెంటయ్య, మండల కార్యదర్శి బొడ్డుపల్లి వెంకటేశం కోరారు. గురువారం మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు.గత దశాబ్దాలుగా ప్రజలు ఎదుర్కొంటున్న తీవ్రమైన సమస్య ఆసుపత్రిలో మౌలిక వసతులు కల్పించాలని, వంద పడకలుగా ఏర్పాటు చేయాలని సిపిఐ(ఎం) మూడు రోజులపాటు చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షకు అన్ని వర్గాల ప్రజలు, ప్రజాసంఘాలు, వ్యాపార సంస్థలు, ఉద్యోగస్తులు, జర్నలిస్టులు, విద్యార్థులు, మహిళలు, కార్మికులు మద్దతు ఇచ్చాయని, సిపిఐ(ఎం) నిరవధిక నిరాహార దీక్షల జయప్రదం కోసం కృషి చేశాయని తెలిపారు. నిరవధిక నిరాహార దీక్షలకు స్పందించిన రాష్ట్ర మంత్రి దామోదర్ రాజనర్సింహ, స్థానిక శాసనసభ్యులు వేముల వీరేశం చొరవతో స్థానిక ఆర్డిఓ శేఖర్ రెడ్డి దీక్షా శిబిరం వద్దకు వచ్చి ఆసుపత్రి నిర్మాణం కోసం ప్రభుత్వం దృష్టి కేంద్రీకరిస్తుందని, వంద పడకల ఆసుపత్రి కోసం కృషి చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామన్నారని తనకు స్వయంగా శాసనసభ్యులు ఫోన్ చేసి వెళ్ళమని చెప్పారని, చెప్పడంతో దీక్షలు విరమింప చేయడం జరిగిందని తెలిపారు.ఇచ్చిన హామీ ప్రకారం ప్రభుత్వం వెంటనే చొరవ చూపాలని లేనిపక్షంలో రెండు నెలల తర్వాత దశలవారీగా ప్రజలందరినీ కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళనను ముమ్మరం చేస్తామని అన్నారు. వంద పడకల ఆసుపత్రి నిర్మాణం జరిగితే సుమారుగా లక్ష మందికి మెరుగైన వైద్యం అందే అవకాశం ఉందని, దీనిపై ప్రభుత్వం శ్రద్ధ పెట్టాలని పేదలకు నాణ్యమైన వైద్యం అందించాలని కోరారు. మూడు రోజులపాటు కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేసిన ప్రజాసంఘాలకు, వివిధ రాజకీయ పక్షాలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి వర్గ సభ్యులు కూరెళ్ళ నరసింహాచారి, కందుల హనుమంతు,మండల కమిటి సభ్యులు గోరిగే సోములు, నాగటి ఉపేందర్, వేముల సైదులు, శానగొండ రాము తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Youtube Subscribe