వ్యవసాయ సహకార పరపతి సంఘం అర్థ వార్షిక సమావేశం
తెలంగాణ కేసరి గుండాల వెబ్ డెస్క్ మార్చి 31
గుండాల మండలం గుండాల ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం మంగళవారం అర్థ వార్షిక సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సీఈవో వై నాగయ్య ఆదాయ వ్యయాల పై నివేదిక చదివి వినిపించారు. 6.5 కోట్ల రుణాలు ఇవ్వగా 4.78 వసూలు చేసినట్లుగా తెలిపారు. సభ్యుల యొక్క వాటాదనం 22884456 రూపాయలు సభ్యుల నుండి రావలసిన అప్పులు 17 కోట్ల 86 లక్షలు కేంద్ర సహకార బ్యాంకుకు చెల్లించవలసిన అప్పులు 13 కోట్ల 84 లక్షలు 2025 26 ఆర్థిక సంవత్సరంలో మండలంలో నాలుగు కేంద్రాలు ఏర్పాటు చేసి ఎరువులు విక్రయాలు చేయగా నికరంగా వచ్చిన లాభం 50 వేల 880 తెలిపారు. ఈ సమావేశంలో గుండాల సర్పంచ్ దేవన బోయిన ఐలయ్య పాచిల్ల సర్పంచ్ అల్లం శెట్టి సంఘ సభ్యులను ఉద్దేశించి మాట్లాడుతూ సంఘ సభ్యులు తీసుకున్న రుణాలు సకాలంలో చెల్లిస్తే ప్రభుత్వం రిఫండ్ కింద మూడు వేలు మేలు అవుతుందని అన్నారు. కొంతమంది రైతులు సంఘంలో సభ్యత్వం కొరకు కోరగా కొత్త సభ్యత్వాలు తీసుకుంటామని సీఈవో నాగయ్య తెలిపారు. సుద్దాల పెట్రోల్ బంకు ఓపెనింగ్ ఇంకా ఎంతకాలం పడుతుందని సభ్యులు అడిగిన ప్రశ్నకు సీఈఓ నాగయ్య సమాధానం ఇస్తూ వచ్చే నెల ఏప్రిల్ లో ఓపెనింగ్ జరుగుతుందని తెలియజేశారు. ఈ అర్ధవార్షిక సమావేశంలో పాల్గొన్న వారు తాజా మాజీ డైరెక్టర్లు ఎగమాటి విద్యాసాగర్ రెడ్డి జంపాల కొమరయ్య పొనగాని అంజయ్య మద్దుల బాల్ రెడ్డి సీఈవో ఏలే నాగయ్య సూపర్వైజర్ సుందర్ హనుమంతు సోమన్న ప్రదీప్ మంగ రేణుక వెంకటమ్మ తదితరులు పాల్గొన్నారు.