ఉత్సాహంగా తెలుగు సంవత్సరాది వేడుకలు
తెలంగాణ కేసరి, వెబ్ డెస్క్, రామన్నపేట, మార్చి 19
తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదిన వేడుకలను వెల్లంకి గ్రామంలో గురువారం ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. దేవాలయంలో, తమ ఇండ్లలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మండలంలోని పలు ఆలయాల్లో అర్చకులు పంచాంగం పటించి వినిపించారు. వెల్లంకిలో ఆంజనేయ స్వామి ఆలయంలో అభిషేకాలు నిర్వహించి ఉగాది పచ్చడిని వితరణ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ ఇడెం రాధా శ్రీనివాస్, మాజీ సర్పంచ్ ఎడ్ల మహేందర్ రెడ్డి,ఉప సర్పంచ్ మిరియాల రాజ్ కుమార్, తాటిపాముల శేఖర్ గౌడ్, ఎడ్ల మల్లారెడ్డి,పాశం సతీష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
WhatsApp
Join Now
Youtube
Subscribe