మల్లు స్వరాజ్యం పోరాట స్ఫూర్తిని నేటి తరం ఆదర్శంగా తీసుకోవాలి

మల్లు స్వరాజ్యం పోరాట స్ఫూర్తిని నేటి తరం ఆదర్శంగా తీసుకోవాలి

– సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎండి జహంగీర్

తెలంగాణ కేసరి, వెబ్ డెస్క్, యాదాద్రి భువనగిరి, మార్చి 19

నైజాం నియంతృత్వానికి, దోపిడి దోర తనానికి, వెట్టి చాకిరికి వ్యతిరేకంగా ఎదురునిలిచి పోరాడిన నాటి వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వీరనారిమని కామ్రేడ్ మల్లు స్వరాజ్యం అని సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎండి జహంగీర్ అన్నారు.గురువారం భువనగిరి లోని సుందరయ్య భవన్ లో మల్లు స్వరాజ్యం 4వ వర్థంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాల చేసి ఘనమైన నివాళులు అర్పించారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో నాటి దొరల ఆగడాలను అరికట్టాలని మహిళా లోకాన్ని చైతన్యం చేస్తూ.. బందూక్ పట్టి పోరాడిన గొప్ప వీరనారి మల్లు స్వరాజ్యం పోరాట స్ఫూర్తిని,ఆమె జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని ప్రజా సమస్యలపై పోరాడాలని పిలుపునిచ్చారు.గతంలో నైజం రజాకార్లు, దోరలు పరిపాలించిన విధంగా దేశంలో బిజెపి, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు పరిపాలన చేస్తున్నాయని అన్నారు. అవి పేద ప్రజల సంక్షేమం మరచి దేశ వ్యాప్తంగా మతోన్మాద బావ జాలాన్ని పెంచి పోషిస్తూ ,ప్రజల మధ్యన విభజన తెస్తుందని విమర్శించారు.అదేవిధంగా అమెరికా చేస్తున్న యుద్ధం అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసే విధంగా ఉందని, దీనిపై దేశ ప్రధాని కనీసం స్పందించక పోవడం ఏమిటని ప్రశ్నించారు. కామ్రేడ్ మల్లు స్వరాజ్యం స్ఫూర్తితో కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా, విబి జి రామ్ జి చట్టాన్ని వ్యతిరేకంగా , విద్యుత్ సవరణ బిల్లు, విత్తన చట్టానికి వ్యతిరేకంగా గ్రామ గ్రామాన ప్రజలను సమీకరించి పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ(ఎం) రాష్ట్ర కమిటి సభ్యులు కొండమడుగు నర్సింహ, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మాటూరి బాలరాజు, కల్లూరి మల్లేశం, బీఎస్పీ రాష్ట్ర నాయకులు బట్టు రామచంద్రయ్య, సిపిఐ(ఎం) జిల్లా కమిటి సభ్యులు కోమటిరెడ్డి చంద్రారెడ్డి, దయ్యాల నరసింహ, గడ్డం వెంకటేష్, తెలంగాణ ప్రజా ఫ్రంట్ నాయకులు మహేష్, రజక వృత్తిదారుల సంఘం జిల్లా కార్యదర్శి వడ్డెబోయిన వెంకటేష్, సిపిఐ(ఎం) భువనగిరి మండల కార్యదర్శివర్గ సభ్యురాలు కొండమడుగు నాగమణి, చిన్నయ్య, ప్రభాకర్ రెడ్డి, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Youtube Subscribe