చేనేత కార్మికుడు ఆత్మహత్య
– వెల్లంకి గ్రామంలో విషాదం
తెలంగాణ కేసరి, రామన్నపేట, మార్చి 10
ఆర్థిక ఇబ్బందులతో అప్పుల పాలై చేనేత కార్మికుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని వెల్లంకి గ్రామంలో చోటుచేసుకుంది. స్థానిక ఎస్ఐ నాగరాజు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని వెల్లంకి గ్రామానికి చెందిన మిర్యాల బాలరాజు (39) చేనేత కార్మికునిగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. చేనేత పని కోసం 5 సంవత్సరాల క్రితం భువనగిరిలోని 5 స్టార్ ఫైనాన్స్ లో మూడు లక్షల యాభై వేల రూపాయలను డబ్బులు అప్పు తీసుకున్నాడు. ప్రతి నెల ఈఎంఐలు కడుతూ వస్తున్నా డు.రెండు నెలల నుండి చేనేత పని సరిగా నడవకపోవడంతో ఈఎంఐలు కట్టలేదు.అప్పు కావడంతో తీర్చే మార్గం లేక మనస్తాపానికి గురయ్యాడు.ఇంట్లో ఎవరు లేని సమయంలో గుర్తు తెలియని పురుగుల మందు తాగి మృతి చెందాడు.మృతని భార్య మిర్యాల అంజలి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ నాగరాజు తెలిపారు.