పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం కృషి చేస్తోంది
పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలను అందిస్తున్నాం
తెలంగాణ కేసరి పరకాల వెబ్ డెస్క్ మార్చి 31
పరకాల పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం యందు సిఎంఆర్ఎఫ్, కళ్యాణ లక్ష్మి చెక్కులను, మంగళవారం పరకాల పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు పరకాల టౌన్, పరకాల, నడి కూడా మండలాలకు చెందిన అర్హులైన లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ మరియు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ….65 మంది లబ్ధిదారులకు 65 లక్షల 7540 వేల రూ విలువగల కళ్యాణ లక్ష్మి మరియు 87 మంది లబ్ధిదారులకు 34 లక్షల 21వేయి రూ విలువగల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణీ చేసామన్నారు.అలాగే నియోజకవర్గ వ్యాప్తంగా 5660 మందికి 40కోట్ల 39 లక్షల 38వేల 452 రూ విలువగల చెక్కులను పంపిణీ చేశామన్నారు.పేద ప్రజలకు అండగా ముఖ్యమంత్రి సహాయనిధి పథకం నిలుస్తుందని, ప్రతి కుటుంబం ఆర్థికంగా ఎదగడమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ లక్ష్యం అని అన్నారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వ పాలకులు దనిక రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని, పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలను అందిస్తున్నామని తెలిపారు. పేద ప్రజల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని అన్నారు.కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో పరకాల ఇందిరా మహిళా డైరీ, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్,నూతన రేషన్ కార్డులు, ఇందిరమ్మ చీరల పంపిణీ,200 యూనిట్ల ఉచిత విద్యుత్, రైతు రుణమాఫీ, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు బీమా, సన్న వడ్లకు రూ 500 బోనస్,సన్న బియ్యం పంపిణీ,మహాలక్ష్మి ,గ్యాస్ సబ్సిడీ, వడ్డీ లేని రుణాలు, శ్రీనిధి రుణాలు, ఇందిరమ్మ ఇల్లు,తదితర సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామన్నారు.