తీపి చేదు సమ్మేళనమే.. ఉగాది

తీపి చేదు సమ్మేళనమే.. ఉగాది

– నియోజకవర్గ ప్రజలకు పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలు

నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం

తెలంగాణ కేసరి, నకిరేకల్, నల్లగొండ ,మార్చి 19

పరాభవ నామ సంవత్సర పండుగ సందర్భంగా గురువారం నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం స్వగృహంలో ఏర్పాటు చేసిన ఉగాది పండుగ పచ్చడి వేడుకలో కుటుంబ సభ్యులతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నకిరేకల్ నియోజకవర్గ ప్రజలందరికీ పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. వ్యవసాయ సంవత్సరంగా పరిగణించే ఈ ఉగాది.. రైతులకు, ప్రజలకు అన్ని రంగాల్లో శుభాలను చేకూర్చనున్నదని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. సాగునీరు, తాగునీరు, పచ్చని పంటలతో తెలంగాణలో నిత్య వసంతం నెలకొన్నదని తెలిపారు. వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడం ద్వారా దాని అనుబంధ రంగాలు, వృత్తులు బలపడి, వ్యవస్థ పరిపుష్టమైందని ఆయన అన్నారు. తెలంగాణ సాధించిన ప్రగతి దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. పరాభవ నామ సంవత్సరంలో తెలంగాణతో పాటు భారతదేశం మరింత గొప్పగా అభివృద్ధి సాధించాలని ఆయన ఆకాంక్షించారు. పరాభవ నామ సంవత్సరంలో ప్రజలందరికి శుభాలు చేకూరాలని ఆకాంక్షించారు. ఉగాది పండగను ఇంటిల్లిపాది ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని కోరారు. దినదినాభివృద్ధి సాధిస్తూ, దేశంలో అగ్రగామిగా వెలుగొందుతున్న తెలంగాణ రాష్ట్రం ప్రస్తుత పరాభవ సంవత్సరంలో మరింత ప్రగతి సాధించాలని, అన్ని వర్గాల ప్రజలు సుఖః సంతోషాలు, ఆనందోత్సాహాలతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు.

కవి సమ్మేళనం కార్యక్రమం…

నకిరేకల్ పట్టణంలోని పన్నాలగూడెం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నందు ఘనంగా నిర్వహించిన కవి సమ్మేళనం కార్యక్రమంలో ఎమ్మెల్యే వేముల వీరేశం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా కవులు సమాజంలోని సమస్యలు, ప్రజల ఆకాంక్షలు మరియు అభివృద్ధి అంశాలపై తమ స్ఫూర్తిదాయక కవితలను వినిపించగా, సభ ఉత్సాహభరితంగా కొనసాగింది.సాహిత్యం సమాజానికి మార్గదర్శకమని, కవులు తమ కలం ద్వారా ప్రజల్లో చైతన్యం, సామాజిక బాధ్యతను పెంపొందించాలని ఎమ్మెల్యే గారు పిలుపునిచ్చారు. అలాగే యువత సాహిత్య రంగంలో ముందుకు రావాలని ప్రోత్సహిస్తూ పాల్గొన్న కవులను ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, సాహిత్యవేత్తలు, కవులు మరియు పెద్ద సంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు.

 

WhatsApp Join Now
Youtube Subscribe