భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్‌గా అంకిత్
తెలంగాణ కేసరి వెబ్ డెస్క్ భద్రాద్రి కొత్తగూడెం ఫిబ్రవరి 26
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు నూతన కలెక్టర్‌గా 2019 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి అంకిత్ నియమితులయ్యారు. ఇప్పటివరకు నిజామాబాద్ జిల్లాలో అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు)గా విధులు నిర్వహిస్తున్న ఆయనను తాజా బదిలీలలో భాగంగా ఈ జిల్లాకు నియమించారు. ఇప్పటి వరకు జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన జితేష్ వి. పాటిల్‌కు బదిలీ ఇవ్వడంతో ఆయన స్థానంలో అంకిత్ బాధ్యతలు చేపట్టనున్నారు. అక్టోబర్ 2, 1991న జన్మించిన అంకిత్, బనారస్ హిందూ విశ్వవిద్యాలయం (BHU) నుండి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో బి.టెక్ పూర్తి చేశారు. పరిపాలనా వ్యవస్థలో వివిధ విభాగాల సమన్వయం, స్థానిక సంస్థల పనితీరుపై పర్యవేక్షణలో ఆయన కీలక పాత్ర పోషించారు.
WhatsApp
Join Now
Youtube
Subscribe