తెలంగాణ కేసరి వెబ్ న్యూస్ జగిత్యాల ఫిబ్రవరి 04
జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలో 17వ వార్డ్ లో
జోరుగా కొనసాగుతున్న కాంగ్రెస్ ప్రసారం బుధవారం 17వార్డ్ కాంగ్రెస్ అభ్యర్థి మైలరపు లింబాద్రి తరుపున కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జి జువ్వాడి నర్సింగారావు ప్రచార రథంపై ప్రచారం చేస్తూ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించిన ఘనత కాంగ్రెస్ పార్టీ దేనిని ప్రతి ఇంటికి 200 యూనిట్ల కరెంటు ఉచితంగా ఇస్తామని చెప్పి మాట తప్పకుండా ఇచ్చిన ప్రభుత్వం గత ప్రభుత్వం రేషన్ కార్డు ఇవ్వడానికి ధైర్యం సరిపోక రేషన్ కార్డు అనే పేరును కూడా మర్చిపోయే విధంగా చేసింది కానీ మన కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు సమకూర్చడం జరిగింది ప్రతి రేషన్ కార్డు దారునికి ఒక్క మనిషికి ఆరు కిలోలు చొప్పున సన్నబియ్యం పంపిణీ చేయడం జరుగుతోంది. 17వ వార్డు నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి లింబాద్రి ని గెలిపించి వార్డ్ ని అభివృద్ధి చేసుకోవాలని. వారు అన్నారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, 7వ వార్డ్ అభ్యర్థి మన్నెకను, 16 వార్డ్ అభ్యర్థి పెంట లక్ష్మి, 18వ వార్డ్ అభ్యర్థి గోలి లలిత, ఆర్యవైశ్య సంఘ పట్టణ అధ్యక్షులు మైలరపు రాంబాబు, చాడ చందు,అక్కినపల్లి సందీప్, పుల్లూరి నవీన్, కోట కిరణ్, ఎల్మి రవి, చిట్టిమెల్లి శ్రీనివాస్, చీలమంతుల శివ తదితరులు పాల్గొన్నారు.