కుక్కల దాడిలో గొర్రెలు మృతి

కుక్కల దాడిలో గొర్రెలు మృతి

తెలంగాణ కేసరి వెబ్ డెస్క్ గుండాల ఫిబ్రవరి 2

గుండాల మండల కేంద్రంలో దేవన బోయిన సోమనరసయ్యకు చెందిన గొర్రెలు వీధి కుక్క దాడిలో 9 గొర్రెలు మృతి చెందగా నాలుగు గొర్రెలు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాయి. మృతిచెందిన గొర్రెల విలువ లక్ష రూపాయల నష్టం వాటిల్లింది. గ్రామ సమీపంలో ఉన్న గొర్రెల దొడ్డిలో కుక్కలు దూరి గొర్రెల గొంతు కోరికేశాయి. సమయానికి గొర్రెల కాపరి రాకుంటే ఇంకా భారీ నష్టం జరిగేది. ఈ నష్టాన్ని ప్రభుత్వం గుర్తించి సహాయం చేయాలని గొర్రెల కాపరి దేవన బోయిన సోమ నరసయ్య ప్రభుత్వాన్ని కోరుతున్నాడు. సంఘటన స్థలాన్ని గ్రామ సర్పంచ్ దేవన బోయిన ఐలయ్య, ఉపసర్పంచ్ ఆవుల సాయి ప్రసాద్ వార్డు సభ్యులు పండుగ ఉపేందర్ పరిశీలించారు.

WhatsApp Join Now
Youtube Subscribe