వంశీ యాదవ్ కు నివాళిగా మాల విరమణ

తెలంగాణ కేసరి వెబ్ డెస్క్ జగిత్యాల జనవరి31:
సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఏరోళ్ల హన్మండ్లు కుమారుడు వంశీ శుక్రవారం హైదరాబాద్ లో ఊరి వేసుకొని మరణించడం జరిగింది. నిన్నటి వరకు మన మధ్య తిరిగిన వంశీ యాదవ్ నేడు మన మధ్య లేకపోవడం స్థానికంగా విషాదాన్ని నింపింది. వంశీ యాదవ్ మృతి కొమిరెడ్డి కుటుంబాన్ని తీవ్రంగా కలిచి వేసింది. వ్యక్తిగతంగా వారి కుటుంబంతో స్వర్గీయ కొమిరెడ్డి రాములు జ్యోతక్కల కు సుదీర్ఘ అనుబంధం ఉన్నది. శివ దీక్షలో ఉన్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కొమిరెడ్డి విజయ్ ఆజాద్ వంశీ మరణ వార్త విన్న  ఆయన హన్మండ్లు కుటుంబానికి కష్టకాలంలో వారికి అండగా ఉండడానికి నిర్ణయించుకున్నారు. శనివారం శివ  దీక్ష మాల విరమణ చేశారు. అత్యంత సన్నిహితులు మరణించినప్పుడు మాల విసర్జన చేసి బాధిత కుటుంబానికి అండగా నిలవడమే నిజమైన మానవ ధర్మం అంటూ హైందవ ధర్మం  ఘోషిస్తుంది. దానిని తూచా తప్పకుండా అమలు చేసి విజయ్ ఆజాద్ తన ఔదార్యాన్ని చాటుకున్నారు.
WhatsApp Join Now
Youtube Subscribe