తెలంగాణ కేసరి దినపత్రిక నూతన క్యాలెండర్ ఆవిష్కరణ
తెలంగాణ కేసరి వెబ్ డెస్క్ నాగర్ కర్నూల్ జనవరి 29
నాగర్ కర్నూల్ జిల్లా కోడేరు మండలం నర్సాయిపల్లి గ్రామంలో గురువారం తెలంగాణ కేసరి దినపత్రిక 2026 నూతన సంవత్సరం క్యాలెండరును గ్రామ సర్పంచ్ ఖాజా బేగం అన్వర్ మాజీ సింగిల్ విండో చైర్మన్ జంబుల బిచ్చారెడ్డి విశ్రాంత ఉపాధ్యాయుడు జంబుల వెంకట్ రెడ్డి లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ కేసరి దిన పత్రిక దిన దినాభివృద్ది చెందాలని ఈ పత్రిక సమాజంలో జరుగుతున్న మంచి చెడులను నిర్భయంగా వార్తలు అందిస్తూ ప్రజల మన్ననలు పొందింది. ఏ రాజకీయ పార్టీకి డబ్బా కొట్టకుండా రాజకీయాలకు అతీతంగా వార్తలు వెలువడుతున్నాయి. తెలంగాణ కేసరి పత్రిక లో ఇంకొక ప్రత్యేకత ఉంది ఎటువంటి వార్త అయినా సరే పూర్తి సమాచారంతో వార్తలు వస్తున్నాయి. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిలా ఈ పత్రిక పని చేస్తుంది. కేవలం ధనార్జన ధ్యేయంగా కాకుండా ఫోర్త్ ఎస్టేట్ విలువలను కాపాడుతూ ఈ పత్రిక ముందుకెళ్తోంది. ఈ సందర్భంగా తెలంగాణ కేసరి దినపత్రిక ఎడిటర్ కేసరి వెంకటేశ్వర్ రావు పత్రిక తెలంగాణ స్టేట్ ఇంచార్జి జి. వెంకటేశ్వర్లు లకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జంబుల వెంకట్ రెడ్డి జంబుల బిచ్చా రెడ్డి ఖాజా బేగం అన్వర్ ఎస్.వెంకట్ రెడ్డి తెలంగాణ కేసరి దిన పత్రిక నాగర్ కర్నూల్ జిల్లా బ్యూరో మన్నె శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.