శ్రీ భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు

శ్రీ భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు

తెలంగాణ కేసరి, వెబ్ డెస్క్, రామన్నపేట ,జనవరి 28

మండలంలోని సిరిపురం గ్రామంలో ఈనెల 29 నుండి మార్చి 1వ తేదీ వరకు జరిగే శ్రీ భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామి తృతీయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో పురప్రముఖులు , భక్తులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఆలయ కమిటీ చైర్మన్ ఏళ్ల నాగమణి – బుచ్చిరెడ్డి బుధవారం ఒక ప్రకటనలో కోరారు. 29వ తేదీన గణపతి పూజ, గజారోహణ కార్యక్రమంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. 30న స్వామివారికి రుద్రాభిషేకం మంగళ స్నానాలు మూల మంత్రము హోమము కార్యక్రమం నిర్వహించబడును. బోడె శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తారు. 31న చండీ హోమం, రుద్ర హోమం మహా పూర్ణాహుతి, గ్రామ ఊరేగింపు కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఒకటవ తేదీన ఆదివారం స్వామివారి హారతి పవళింపు సేవ కార్యక్రమాలతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయని ,ఈ కార్యక్రమాలలో భక్తులు, ప్రజలు సకాలంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని అట్టి ప్రకటనలో ఆలయ కమిటీ చైర్మన్ ఏళ్ల నాగమణి – బుచ్చిరెడ్డి కోరారు.

WhatsApp Join Now
Youtube Subscribe