అభ్యర్థుల వివరాలు క్షుణ్ణంగా పరిశీలించాలి

అభ్యర్థుల వివరాలు క్షుణ్ణంగా పరిశీలించాలి

జిల్లా కలెక్టర్ హనుమంతరావు

తెలంగాణ కేసరి, వెబ్ డెస్క్  రామన్నపేట , నవంబర్ 30

నామినేషన్ల స్వీకరణలో భాగంగా
అభ్యర్థుల వివరాలు క్షుణ్ణంగా పరిశీలించాలని జిల్లా కలెక్టర్ హనుమంతరావు సూచించారు.ఆదివారం గ్రామపంచాయతీ ఎన్నికల పేజ్-2 లో భాగంగా రామన్నపేట మండలం తుమ్మలగూడెం క్లస్టర్, రామన్నపేట మండల కేంద్రంలో నామినేషన్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ పరిశీలించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ…ఇప్పటివరకు ఎంతమంది నామినేషన్ పత్రాలు తీసుకెళ్లారని అడిగి తెలుసుకున్నారు.ఈరోజు ఏమైనా నామినేషన్లు వచ్చాయా అని అడిగారు.నామినేషన్ వేసే ముందు హెల్ప్ డెస్క్ లో నామినేషన్ పత్రాలను పరిశీలించాలన్నారు.అభ్యర్థులు అన్ని వివరాలు నమోదు చేశారో లేదో ఒకటికి రెండు సార్లు చెక్ చేయాలని సూచించారు. నామినేషన్ల స్వీకరణలో ఎలాంటి తప్పిదాలకు తావు లేకుండా స్వీకరించాలన్నారు. ఎన్నికల విధులు ప్రతి అధికారి బాధ్యతతో విధులు నిర్వహించాలన్నారు. నామినేషన్ స్వీకరణలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు.ఆయన వెంట తహసిల్దార్ లాల్ బహదూర్, ఎంపిడిఓ ఆవుల రాములు,సంబంధిత అధికారులు ఉన్నారు.

WhatsApp Join Now
Youtube Subscribe