దుబ్బాక మార్కెట్ కమిటీ చైర్మన్ గా కొంగరి రవి
తెలంగాణ కేసరి మిరుదొడ్డి నవంబర్ 26
దుబ్బాక వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల పరిధిలోని బలవంతపూర్ గ్రామానికి చెందిన రైతుబిడ్డ కొంగరి రవి నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా నియమించినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జిల్లా ఇన్చార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి, దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి కి సహకరించినటువంటి నాయకులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ కార్యకర్తలకు ప్రజలకు సేవకుడిలాగా పని చేస్తానని అన్నారు.
WhatsApp
Join Now
Youtube
Subscribe