శాంతియుత ధర్నాను విజయవంతం చేయండి
బీసీ జన సభ జిల్లా నాయకులు పుట్ట వీరేష్ యాదవ్
తెలంగాణ కేసరి, వెబ్ డెస్క్, యాదాద్రి భువనగిరి, నవంబర్ 22
ఈనెల 24న బీసీ జన సభ రాష్ట్ర అధ్యక్షులు రాజారాం యాదవ్ ఆధ్వర్యంలో బిజెపి, కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల ముందు నిర్వహించనున్న శాంతియుత ధర్నాను విజయవంతం చేయాలని బీసీ జన సభ జిల్లా నాయకులు పుట్ట వీరేష్ యాదవ్ పిలుపునిచ్చారు.శనివారం నాడు భువనగిరిలోని రాఘవేంద్ర హోటల్ లో పోస్టర్ ఆవిష్కరించిన అనంతరం వీరేష్ యాదవ్ మాట్లాడారు.కులాకు, బిసి సంఘాలకు అతీతంగా నిర్వహించనున్న శాంతియుత ధర్నాలో పెద్ద ఎత్తున పాల్గొని దిగ్విజయం చేయాలని కోరారు.రాజ్యాంగ సవరణ చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్, బిజెపి లదేనని ఆయన అన్నారు.బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చాకే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలు నిర్వహిస్తే రాష్ట్రం వ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బిసి సంఘం జిల్లా నాయకులు నక్కల చిరంజీవి యాదవ్,పద్మశాలి సంఘం యువజన జిల్లా అధ్యక్షులు మిర్యాల శ్రీనివాస్, మేరు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కొత్త ఆంజనేయులు,యాదవ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు గుండెబోయిన సురేష్ యాదవ్, మాజీ ఎంపిటిసి రసాల మల్లేష్ యాదవ్, శ్రీరాం శరత్ యాదవ్, నవీన్ యాదవ్,పబ్బతి హరి కృష్ణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.