ముదిరాజులకు సముచిత స్థానం కల్పించాలి
తెలంగాణ కేసరి ఆలేరు వెబ్ డెస్క్ నవంబర్ 21
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గం తుర్కపల్లి మండలం శుక్రవారం ముదిరాజ్ మత్స్యకారుల సంక్షేమ సంఘం తెలంగాణ ఉపాధ్యక్షులు బోయిని నాగరాజు విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడుతూ ముదిరాజ్ మత్స్యకారుల దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అధికారిక లెక్కల ప్రకారం 85 శాతానికి పైగా ముదిరాజ్ సొసైటీలు కులానికి చెందినవి ఉన్నాయి అని అన్నారు. 18 సంవత్సరాలు నిండిన ముదిరాజ్ లకు ఏలాంటి స్కిల్ టెస్ట్ లేకుండా సభ్యత్వాలు ఇవ్వాలని అన్నారు. జీవో 98 సవరణ చేసి ముదిరాజ్ లకు కూడా ప్రతి జిల్లాలో నీ ముదిరాజ్ భవనాలు ఏర్పాటు చేయాలని ప్రతి గ్రామ గ్రామాన ముదిరాజ్ సంఘం సొసైటీలను ఏర్పాటు చేసి బిల్డింగ్ సాంక్షన్ చేయాలని తెలంగాణ ప్రభుత్వం 2015 సంవత్సరంలో జీవో నెంబర్ 6 ఇచ్చిన జీవోను అమలు చేయాలని 2009 సంవత్సరంలో ముదిరాజ్ లను బి సి (డి) నుండి బి సి (ఏ ) లో చేర్చాలని. జీవో 15 సర్వే రిపోర్ట్ సుప్రీంకోర్టుకు ప్రభుత్వం తరఫున ఇవ్వాలని ప్రతి గ్రామంలో ముదిరాజ్ లకు 5 ఎకరాలు కేటాయిస్తూ పండ్ల తోటల పెంపకం కోసం యాక్ట్ .1.70 ముదిరాజ్ లకు వర్తించేలా చూడాలని తెలంగాణలో బెస్తవాలు గంగపుత్రులు రెండు లక్షల మంది ఉంటే ముదిరాజ్ లు 52 లక్షల పైబడి ఉన్నారు. కాబట్టి ముదిరాజ్ లకు సర్వ హక్కులు కల్పించాలని బోయిని నాగరాజు తెలంగాణ ప్రభుత్వమును విలేకరుల సమావేశంలో కోరారు.