ఆయిల్ ఫాం ఫ్యాక్టరీని సీఎం చేతుల మీదుగా ప్రారంభానికి ముందస్తు ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్
తెలంగాణ కేసరి వెబ్ డెస్క్ సిద్దిపేట నవంబర్ 20
నంగునూర్ మండలం లోని నర్మేట గ్రామంలో 300కోట్లతో నిర్మాణం చేస్తున్న ఆయిల్ ఫామ్ ప్యాక్టరీనీ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా త్వరలో ప్రారంభానికి ముందస్తు ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ కె. హైమావతి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఫ్యాక్టరీ లోపల బీటీ రోడ్ నిర్మాణం, డ్రైనేజీ నిర్మాణం పనులు వేగం పెంచాలని ఇంజనీరింగ్ అధికారులకు తెలిపారు. రోడ్ వెంబడి చెట్ల పొదలు తొలగించాలి. పబ్లిక్ మీటింగ్ కి వివిధ జిల్లాల నుండి ప్రజల సమీకరణ కోసం వాహనాల ఏర్పాటు పార్కింగ్ కోసం పక్కన గల టిజిఐఐసి స్తలం లో చదును చెయ్యాలని, విఐపి పార్కింగ్, హెలిప్యాడ్ తయారు చేయాల్సిందిగా అర్ అండ్ బి అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి పర్యటనకు కావలసిన అన్ని అనుమతులు తీసుకుని ప్రారంభానికి సంబంధించిన పనులను పక్కా ప్రణాళికలతో పగడ్బందిగా సిద్ధం చెయ్యాలని ఆయిల్ ఫ్రైడ్ అధికారులను ఆదేశించారు. అందరూ అధికారులు సమన్వయం తో పని చేసి ప్రారంభానికి సిద్ధం చెయ్యాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ సదానందం, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి సువర్ణ, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి స్వరూప రాణి, ఆయిల్ ఫ్రైడ్ మేనేజర్ సుధాకర్ రెడ్డి, ఆయిల్ ఫ్రైడ్ ఇంజనీర్ శ్రీకాంత్ రెడ్డి, ఇతర శాఖల అధికారులు, తదితరులు ఉన్నారు. నర్మేట గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ సందర్శించారు. ట్యాబ్ ఎంట్రీ లో జాప్యం కాకుండా చూసుకోవాలని డి ఎం సివిల్ సప్లై ను ఫోన్ ద్వారా ఆదేశించారు. పే మెంట్ వివరాలు ఆరా తీశారు. ఇక్కడ లోడ్ చేసిన వడ్లు ఉమా మహేశ్వర అంక్షాపూర్, శ్రీనివాస్ మిల్ ముండ్రాయి పంపించిస్తునట్లు సిబ్బంది కలెక్టర్ కి తెలిపారు. వాతావరణ శాఖ సూచనలు పాటించాలని అకాల వర్షాలు కురుస్తాయని రాత్రి సమయంలో రైతులు ధాన్యం పై టార్పలిన్ కవర్లు కప్పుకోవాలని సూచించారు. తేమశాతం రాగానే వెంటనే గన్నీలలో నింపి లోడ్ అయ్యేలా పని చెయ్యాలని సెంటర్ సిబ్బందిని ఆదేశించారు.