వ్యక్తి అదృశ్యంపై పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు
తెలంగాణ కేసరి చండ్రుగొండ నవంబర్ 18
చండ్రుగొండ గ్రామానికి చెందిన వ్యక్తి అదృశ్యమైన ఘటన మండల పరిధిలో చోటుచేసుకుంది.. పోలీసులు కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి… చండ్రుగొండ గ్రామానికి చెందిన సయ్యద్ జహీర్ పాషా (40) తాపీ మేస్త్రిగా పనిచేస్తున్నాడు. ఈనెల 15వ తేదీన ఉదయం 9 గంటలకు తాపీ పని కి వెళ్తున్నాను అని ఇంటిలో చెప్పి సాయంత్రం వరకు ఇంటికి తిరిగి రాలేదు.. దీంతో కంగారుపడిన కుటుంబ సభ్యులు ఆందోళన చెంది బంధువులకి స్నేహితులకు సంప్రదించగా ఆచూకీ లభ్యం కాకపోవడంతో ఆందోళన చెందిన జహీర్ పాషా, భార్య సయ్యద్ షబానా మంగళవారం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న చండ్రుగొండ ఎస్సై శివరామకృష్ణ జహీర్ పాషా మిస్సింగ్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ… పై ఫోటోలో ఉన్న వ్యక్తి ఆచూకీ కనిపిస్తే వెంటనే చండ్రుగొండ పోలీస్ స్టేషన్ నెంబర్ కు 8712682043 సమాచారం అందించాలని కోరారు.