ఘనంగా సామూహిక సత్యనారాయణ వ్రతాలు

తెలంగాణ కేసరి వెబ్ డెస్క్ జగిత్యాల నవంబర్17

జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండలంలోని మేడిపల్లి గ్రామంలో శ్రీ వాసవి మాత చైతన్య నగర్ ఆర్యవైశ్య వాడకట్టు సంఘం ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీ రామసాహిత వేరే వెంకట సత్యనారాయణ దేవాలయంలో 25 జంటలతో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాన్ని సోమవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. అనంతరం కార్తీకమాస ఉసిరి చెట్టు కింద వనభోజనాలు ఘనంగా నిర్వహించి వచ్చిన అతిధులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య మహాసభ జగిత్యాల జిల్లా అధ్యక్షులు మైలారపు లింబాద్రి మాట్లాడుతూ ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహించి సత్యనారాయణ స్వామి వ్రతాలు చేయడం ఎంతో గొప్ప విషయమని ఇలా మన సాంస్కృతిని పెంపొందిస్తూ ముందు ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేపడితే బాగుంటుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులు మైలారపు ఆర్యవైశ్య గౌరవ అధ్యక్షులు కోట సుమన్ , చాడ చందు, గంప శ్రీనివాస్, కటకం శంకర్, వెలుగందుల లక్ష్మీ నర్సయ్య, ఎల్మి రవి, డొంతుల లక్ష్మీనారాయణ, పడిగేల శివ, చాడ సురేష్, కోట కిరణ్, పడిగేల శ్రీను, దొంతుల సంతోష్, పుల్లూరి మధుమిత, పుల్లూరి నవీన్, బండారి శివ, చీలమంతుల శివ, లక్ష్మీపతి, చిట్టి మిల్లి శ్రీనివాస్, బండారి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Youtube Subscribe