జూబ్లీహిల్స్ గెలుపు కాంగ్రెస్ కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపింది
నియోజకవర్గ సేవాదళ్ ప్రధాన కార్యదర్శి ఫజల్ బక్షి
జారే అన్న నేతృత్వంలో ప్రచారం చేసి విజయం సాధించాం
స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ జెండా ఎగరవేస్తాం
తెలంగాణ కేసరి చండ్రుగొండ నవంబర్ 14
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపుతో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపిందని అశ్వరావుపేట నియోజకవర్గ సేవాదళ్ ప్రధాన కార్యదర్శి మహ్మద్ ఫజల్ బక్షి అన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో నవీన్ యాదవ్ విజయాన్ని పునస్కరించుకొని శుక్రవారం చండ్రుగొండ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రధాన సెంటర్ లో బాణాసంచా కాల్చి స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఫజల్ బక్షి మాట్లాడుతూ… రెండు సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనను చూసిన ప్రజలు కాంగ్రెస్ పార్టీని మనస్ఫూర్తిగా దీవించారన్నారు. దానికి నిదర్శనమే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి పరిపాలనకు నిదర్శనమే ఈ ఉప ఎన్నిక విజయమన్నారు. నవీన్ యాదవ్ విజయం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అశ్వరావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ రహమత్ నగర్ డివిజన్ ఇన్చార్జిగా బాధ్యతలు స్వీకరించడం జరిగిందన్నారు. ఉప ఎన్నిక విజయం కోసం నియోజకవర్గంలోని ముఖ్య అనుచరులం ఎమ్మెల్యే వెంట నడుస్తూ విస్తృత ప్రచారం నిర్వహించడం జరిగిందన్నారు. అందులో భాగంగానే రహమత్ నగర్ లో 6025 ఓట్ల మెజార్టీ వచ్చిందన్నారు. ఈ విజయంలో చండ్రుగొండ మండలంలోని మరి కొంతమంది యువ నాయకులు, కూడా పాల్గొని ప్రచారం నిర్వహించి నవీన్ యాదవ్ గెలుపులో పాల్పంచుకోవడం జరిగిందన్నారు. గత పది సంవత్సరాల పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదని ఇక రాబోయేది మొత్తం ప్రజాపాలన అన్నారు. రాబోయే స్థానిక సంస్థలు ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు మాలోత్ బోజ్యానాయక్, జిల్లా దిశా కమిటీ సభ్యులు బొర్రా సురేష్, మండల అధ్యక్షుడు దారం గోవిందరెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షులు తుమ్మలపల్లి సురేష్, సారెపల్లి శేఖర్, సేవాదళ్ జిల్లా అధ్యక్షులు కేశబోయిన నరసింహారావు, మండల నాయకులు సంకా శంకర్, ఆర్కే, బీ కోటేశ్వరరావు, బుంగ శ్రీను, ఎస్కే ఇమ్రాన్, ఎస్కే వసీం, బడుగు కృష్ణవేణి, బన్నె నాగరాజు, ఇస్లావత్ రుక్మిణి, తదితర ముఖ్య నాయకులు, కార్యకర్తలు, పాల్గొన్నారు.
