అనంతుల యాదగిరి సంస్మరణ సభ

అనంతుల యాదగిరి సంస్మరణ సభ

తెలంగాణ కేసరి వెబ్ డెస్క్ గుండాల నవంబర్ 14

గుండాల మండలం మరిపడిగా గ్రామంలో అనంతుల యాదగిరి స్తూపం వద్ద జెండా ఆవిష్కరించిన యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి యానాల దామోదర్ రెడ్డి హాజరు కాగా ఇంటి వద్ద సిపిఐ గ్రామ కార్యదర్శి యాదయ్య అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా సమావేశాన్ని ఉద్దేశించి యానాల దామోదర్ రెడ్డి సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గోద శ్రీరాములు మాట్లాడుతూ అనంతుల యాదగిరి సేవలు వెలకట్టలేవని కమ్యూనిస్టు అభ్యుదయ వాళ్ళని బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం పేద ప్రజల అభివృద్ధి కోసం గ్రామములో జరుగుతున్న దౌర్జన్యాలపై వ్యతిరేకంగా పోరాడి బడుగు బలహీన వర్గాల కోసం కృషి చేశాడని. సిపిఐ పార్టీ అభివృద్ధి కోసం కృషి చేసిన వ్యక్తి గుర్రం యాదగిరి రెడ్డి గెలుపు కోసం ఈ ప్రాంతంలో ప్రజలను చైతన్య పరుస్తూ పార్టీ ఇచ్చిన ప్రతి కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటూ చివరి వరకు పార్టీ కోసం పనిచేసిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు . ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు కే హరిచంద్ర, మండల కార్యదర్శి అనంతుల రామచంద్రయ్య, మోత్కూరు మండల కార్యదర్శి అన్నెపు వెంకట్, మండల కార్యవర్గ సభ్యులు కొమురయ్య, సత్యనారాయణ స్వామి, జి వెంకన్న, మరిపడిగా గ్రామ మాజీ సర్పంచ్ దుంపల శ్రీనివాస్, పిఎసిఎస్ డైరెక్టర్ ఎస్ ఉప్పలయ్య, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Youtube Subscribe