చేనేత అభివృద్ధికి కృషి చేయాలి
ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం కమిషనర్ కు వినతి పత్రం
తెలంగాణ కేసరి వెబ్ డెస్క్ గుండాల నవంబర్ 14
చేనేత, జౌళి శాఖ కమిషనర్ శైలజ రామయ్యర్ కు వినతి పత్రం అందజేస్తున్న ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం తెలంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మీనరసయ్య,
చేనేత అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం కోరారు. తెలంగాణ చేనేత కార్మిక సంఘం నాయకులతో కలిసి చేనేత జౌళి శాఖ కమిషనర్ శైలజ రామయ్య ను కలిసి హైదరాబాదులోని కార్యాలయంలో వినతి పత్రం శుక్రవారం అందజేశారు.ఈ సందర్భంగా తెలంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాసికంటి లక్ష్మీనరసయ్యతో కలిసి ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం మాట్లాడుతూ…
రాష్ట్రంలో సుమారు లక్ష కుటుంబాలు చేనేత వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నారని సంక్షోభంలో కోరుకపోయిన చేనేత రంగాన్ని గట్టు ఎక్కించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. చేనేత కార్మికుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పథకాలను, ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ఆయన కోరారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు రూ.1 లక్ష లోపు ఉన్న రుణాలను వెంటనే మాఫీ చేయాలని కోరారు. రుణమాఫీ చేసిన సభ్యులకు తిరిగి లక్ష వరకు రుణాలు ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు. ఇందులో పాల్గొన్న చేనేత నాయకులు చేనేత కార్మిక సంఘం యాదాద్రి జిల్లా అధ్యక్షులు కస్తూరి బిక్షపతి ఏషాల అశోక్ గుండాల చేనేత సహకార సంఘం అధ్యక్షులు దుడుక ఉప్పలయ్య మోత్కూర్ చేనేత సహకార సంఘం అధ్యక్షులు జల్ది రాములు శ్రీపతి సత్యనారాయణ కర్నాటి మారయ్య సుర పెళ్లి జనార్ధన్ కమిషనర్ కు వినతి పత్రం అందజేసిన వారిలో ఉన్నారు.