స్వాతంత్రోద్యమానికి ఊపిరి పోసిన వందేమాతరం
తహశీల్దార్ లాల్ బహదూర్
తెలంగాణ కేసరి, వెబ్ డెస్క్, రామన్నపేట, నవంబర్ 07
దేశ స్వాతంత్ర్య ఉద్యమానికి ఊపిరి పోసిన గీతం వందేమాతరం అని తహసీల్దార్ లాల్ బహదూర్ అన్నారు. వందేమాతర గేయానికి 150 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా శుక్రవారం మండల కేంద్రంలోని సుభాష్ సెంటర్లో వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో సామూహిక వందేమాతర గేయంను అలపించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ..స్వాతంత్య్ర సమర ఉద్యమ పోరాటంలో వందేమాతర గీతం అందరిని ఏకతాటిపైకి తీసుకురావడంతో పాటు స్పూర్తిని రగిలించి ఉద్యమానికి ఊపిరి పోసిందన్నారు. కుల మతాలకు అతీతంగా దేశ సమైక్యతకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సీఐ వెంకటేశ్వర్లు, వైద్యులు వీరన్న, మాధవచారి, దేవ్ రాజ్, ప్రిన్స్ పాల్ జగదీష్, ఎస్ఐ నాగరాజు, ఏఎస్ఐ సురేందర్, హెడ్ కానిస్టేబుల్ కమలాకర్, కానిస్టేబుల్ స్వామి నాయక్ ,ప్రవీణ్ , వివిధ పార్టీల నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.