తెలంగాణ కేసరి జగిత్యాల వెబ్ డెస్క్ నవంబర్ 06
జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండలం చెవుల మద్ది, రామారావు పల్లి గ్రామాల్లో ప్యాడి సెంటర్లలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గురువారం అదనపు కలెక్టర్ బి.ఎస్ లత సందర్శించారు. ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రంలో తూకపు యంత్రాలు తేమయంత్రాలు ప్యాడి క్లీనర్స్ టార్ఫలెన్లు సరిపోయినన్ని అందుబాటులో ఉండే విధంగా ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులకు ఆదేశించారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన సదుపాయాలను సమకూర్చాలని సూచించారు. కేంద్రంలో నిర్వాహకులు వివరాలు మద్దతు ధర టోల్ ఫ్రీ నెంబర్ వివరాలు స్పష్టంగా కనిపించేలా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని సూచించారు. రైతులు తమ ధాన్యము కొనుగోలు కేంద్రాలకు తీసుకురాగానే రసీదులు జారీ చేయడంతో పాటు వారి బ్యాంకు వివరాలను సక్రమంగా నమోదు చేసి పంట రుసుము సకాలంలో రైతులు ఖాతాలో జమ అయ్యేలా చూడాలని సూచించారు. అన్ని రకాల రిజిస్టర్లు పకడ్బందీగా నిర్వహించాలని పేర్కొన్నారు. మెట్ పల్లి మండలం పెద్దాపూర్ గ్రామంలో నిజాం రైస్ ఇండస్ట్రీ రైస్ మిల్లును పరిశీలించారు. కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చే వరి ధాన్యమును వెంటనే అన్లోడ్ చేయించాలని లారీలను పెండింగ్ ఉంచకుండా అమాలీలను వర్కలను ఎక్కువ పెట్టాలని. రైతులతో అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం పంటకు మద్దతు ధర ఏ గ్రేడ్ రకానికి 2389 బి గ్రేడ్ రకానికి 2369 కల్పిస్తుందని రైతులు వరి ధాన్యము ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకే ఇవ్వాలని తెలిపారు. ధాన్యాన్ని శుభ్రపరిచి తగిన తేమ శాతం కలిగిన తర్వాత మాత్రమే తూకానికి ఇవ్వాలన్నారు. వరి కొనుగోలు ప్రక్రియలు రైతులకు ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా టోల్ ఫ్రీ నంబర్ 18004258187 ను సంప్రదించాలని తెలిపారు. ఈ పరిశీలనలో మెట్ పల్లి ఆర్డీవో శ్రీనివాస్, ఎమ్మార్వో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.