తెలంగాణ కేసరి జగిత్యాల వెబ్ డెస్క్ నవంబర్06
జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండల కేంద్రంలో తహసిల్దార్ కార్యాలయం ను గురువారం ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా అదనపు కలెక్టర్ బిఎస్ లత.నూతనంగా ప్రవేశపెట్టిన భూ భారతి రెవెన్యూ సదస్సులో వచ్చిన భూ సమస్యలపై ప్రతి దరఖాస్తు ను శూన్యంగా పరిశీలించి పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. మీసేవ సర్టిఫికెట్లను పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు పూర్తి చేయాలని సర్టిఫికెట్ల ప్రజలకు అందించవలసిందిగా అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు మెట్ పల్లి రెవెన్యూ డివిజనల్ అధికారి శ్రీనివాస్, మెట్ పల్లి తహసిల్దార్, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
WhatsApp
Join Now
Youtube
Subscribe