జోరు మీద ఉన్న కాంగ్రెస్ ప్రచారం

తెలంగాణ కేసరి జగిత్యాల వెబ్ డెస్క్ నవంబర్06

టిపిసిసి డెలిగేట్ మెంబర్ కల్వకుంట్ల సుజీత్ రావు ఆదేశాల మేరకు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ఘన విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ, కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు హిమాంగూడ లో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. చేతి గుర్తు పై ఓటు వేసి నవీన్ యాదవ్ ను గెలిపించాలని కోరారు. అనంతరం కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ. జూబ్లీహిల్స్ ప్రజలు అభివృద్ధి, ప్రజాసేవ పట్ల కట్టుబాటున్న నాయకుడిగా నవీన్ యాదవ్ ను గుర్తించారని, ఆయనను విశ్వసించి గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు. నవీన్ యాదవ్ విజయం నియోజకవర్గ అభివృద్ధికి కొత్త ఊపును ఇస్తుందని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ నాయకత్వంపై గట్టి విశ్వాసం ఉంచారని, ఆ నమ్మకం ఈ ఎన్నికల్లో ఓట్ల రూపంలో ప్రతిబింబిస్తుందని తెలిపారు. నవీన్ యాదవ్ విజయం ఆ ప్రజా విశ్వాసానికి నిదర్శనంగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారుఈ కార్యక్రమములో కిసాన్ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వాకిటి సత్యం రెడ్డి మెట్ పల్లి కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు ఖుతుబోద్దీన్ పాషా, సేవాదళ్ ప్రధాన కార్యదర్శి అందే మారుతి కాంగ్రెస్ సీనియర్ నాయకులు,కోరే రాజకుమార్, మహమ్మద్ జాఫర్ రాజేందర్, రాజేష్ సాయిబుద్దీన్, సమీర్, తదితరులు పాల్గొన్నారు

WhatsApp Join Now
Youtube Subscribe