సంగారెడ్డి లో ఘనంగా సదర్ ఉత్సవాలు
ఆడిపాడిన జగ్గారెడ్డి
ఆకట్టుకున్న దున్నపోతుల విన్యాసాలు
తెలంగాణ కేసరి వెబ్ డెస్క్ సంగారెడ్డి నవంబర్ 05
సంగారెడ్డి పట్టణ కేంద్రంలోని ఐబివద్ద ప్రతి సంవత్సరం యాదవ సోదరుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సదర్ ఉత్సవాలు బుధవారం అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కార్యక్రమం ఆసాంతం హుషారుగా కనిపించిన ఆయన కుర్రకారును హోరెత్తించారు. యువకుల కేరింతలతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లింది. దున్నపోతుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమానికి సంగారెడ్డి పట్టణ మరియు పరిసర ప్రాంతాల యాదవ సోదరులు, ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యారు.
WhatsApp
Join Now
Youtube
Subscribe
