స్వర్ణగిరిలో వైభవంగా కార్తీక పౌర్ణమి వేడుకలు

స్వర్ణగిరిలో వైభవంగా కార్తీక పౌర్ణమి వేడుకలు

– ఘనంగా కోటి దీపోత్సవం

తెలంగాణ కేసరి, వెబ్ డెస్క్, యాదాద్రి భువనగిరి, నవంబర్ 05

పవిత్ర పుణ్యక్షేత్రమైన స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో కార్తీక పౌర్ణమి వేడుకలు వైభవంగా జరిగాయి.నిత్య ఆరాధనలు పూర్తి చేసిన తరువాత స్వామి వారి సన్నిధిలో కోటి దీపోత్సవ కార్యక్రమం నిర్వహించారు. శ్రీ వారి గర్భాలయమును, ఇతర సన్నిధిలను, గోపుర ప్రాకార మంటపాలను దీపాలతో కాంతివంతంగా అలంకరించారు.దేశంలోని ఏకైక జలనారాయణ సన్నిధిని కోటి దీపాలతో వెలిగించి జల నారాయణ స్వామి వారికి నక్షత్ర హారతి సమర్పించారు. అనంతరం శ్రీ వారిని గరుడ వాహనం మీద అధిరోహింప చేసి ఆలయ తిరుమాడ వీధుల్లో ఊరేగించి జ్వాలా తోరణ కార్యక్రమం భక్తుల గోవింద నామస్మరణల నడుమ వైభవంగా నిర్వహించారు. పై కార్యక్రమాలలో ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త శ్రీ మానేపల్లి రామారావు కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. కోటి దీప కాంతులలో స్వర్ణగిరి క్షేత్రం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.

WhatsApp Join Now
Youtube Subscribe