అనంత స్వర్ణ గిరిలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతం..

అనంత స్వర్ణ గిరిలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతం..

– కార్తీక పౌర్ణమి సందర్భంగా అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు

తెలంగాణ కేసరి, వెబ్ డెస్క్, రామన్నపేట, నవంబర్ 05

రామన్నపేట మండలంలోని కక్కిరేణి, నార్కెట్పల్లి మండలంలో చిన్న తుమ్మలగూడెం , మాండ్ర గ్రామాల పరిధిలో ఉన్న అనంత స్వర్ణగిరి శ్రీ పఠాభి సీతారామచంద్ర స్వామి దేవాలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతం , మరియు శ్రీ పట్టాభి సీతారామ స్వామి కళ్యాణ మహోత్సవాన్ని బుధవారం అంగరంగ వైభవంగా భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.అనంతరం మహాలక్ష్మి అమ్మవారి కొలనులో కార్తీక దీపాలు వెలిగించారు. సుమారుగా 500 మంది భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని శ్రీరామదాసు సేవాసమితి అధ్యక్షులు ఉండ్రా లింగారెడ్డి భాగ్యమ్మ దంపతులు నిర్వహించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ..మూడు గ్రామాల మధ్య వెలిసిన శ్రీ పట్టాభి రామచంద్ర స్వామి దేవాలయం ఎంతో పవిత్రమైనదని శ్రీ మహాలక్ష్మి , శ్రీ మహాభిరామచంద్రస్వామి దేవాలయ పుణ్యక్షేత్రాన్ని దర్శించడానికి విదేశాల నుండి కూడా వస్తున్నారని ,ప్రజలందరూ మనశ్శాంతి కోసం ప్రకృతిలో ప్రశాంతంగా ఉన్న దేవాలయం ఇదేనని , నిత్యం దైవ దర్శనం , అర్చనలు ప్రతినెల అమ్మవారికి , పట్టాభి సీతారామచంద్రస్వామి మాస కల్యాణం ప్రతినెల నిర్వహించడం జరుగుతుందని, మహాలక్ష్మి అమ్మవారి , పట్టాభి సీతారామచంద్రస్వామి ఆశీస్సులు ఎల్లపుడూ ప్రజలు పొందగలరని తెలిపారు.ఈ కార్యక్రమంలో దేవాలయ ప్రధాన అర్చకులు ఉత్తరపల్లి నరసింహచార్యులు , మనీ , యాట వెంకన్న , మడూరి జమున కిషన్ రావు, సామజిక కార్యకర్త వేముల సైదులు , కొనతం కృష్ణారెడ్డి , అవుల సైదులు , జానయ్య , దంతూరి లింగయ్య , చిల్లా సునీత సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Youtube Subscribe