అఖిలపక్షాల ఆధ్వర్యంలో తహశీల్దార్ కు వినతి

అఖిలపక్షాల ఆధ్వర్యంలో తహశీల్దార్ కు వినతి

తెలంగాణ కేసరి వెబ్ డెస్క్ రామన్నపేట నవంబర్ 03

బీసీలకు స్థానిక ఎన్నికల్లో మరియు విద్యా,ఉద్యోగ రంగాల్లో 42 శాతం రిజర్వేషన్లను కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు కల్పించాలని, కోరుతూ సోమవారం మండల కేంద్రంలో అఖిలపక్షాల ఆధ్వర్యంలో తహశీల్దార్ లాల్ బహదూర్ కు స్థానిక తహసిల్దార్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ..రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఆమోదించిందని, ఈ బిల్లులు ఆమోదం పొందిన తర్వాత కేంద్ర ప్రభుత్వానికి పంపి ఏడు నెలలు కావస్తున్న ఇంకా 9 షెడ్యూల్లో చేర్చడానికి పెండింగ్ లో ఉన్నాయని,బిల్లును వెంటనే పార్లమెంట్ సమావేశాల్లో 9వ షెడ్యూల్లో తీర్చడానికి కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో డి ఎస్ పి రాష్ట్ర కమిటీ సభ్యులు నల్ల నరేందర్,మండల అధ్యక్షులు బందెల ఆశోక్,నకేరేకంటి నరేందర్, వివిధ పార్టీల నాయకులు, పోషబోయిన మల్లేశం, జమీరుద్దీన్,మేడి మల్లేష్ ,మారోజు అనంత చారి, సంగిశెట్టి సుదర్శన్, గంజీగోవర్ధన్ రచ్చ యాదగిరి, శివరాత్రి సామయ్య, ఊట్కూరి భగవంతం, దశరథ చారి, సైదులు, జంగిలి మల్లేష్ పెండెం రవి, నరసింహ చారి,బందెల అంజయ్య బొడ్డు అశోక్, నకిరేకంటి స్వామి తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Youtube Subscribe