కర్నూల్ బస్సు ప్రమాదంపై దిగ్బ్రాంతి వ్యక్తం చేసిన మాజీ ఎంపీ నామ
తెలంగాణ కేసరి వెబ్ డెస్క్ అక్టోబర్ 24
హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళుతున్న ట్రావెల్స్ బస్సుకు కర్నూలు జిల్లాలో చోటుచేసుకున్న ఘోర బస్సు ప్రమాదం పట్ల బిఆర్ఎస్ మాజీ లోక్సభ పక్షనేత, ఖమ్మం మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రాణాలు కోల్పోయిన ప్రయాణికుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ దుర్ఘటనలో గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరటం తో పాటు, వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రమాద ఘటనలోని బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలవాలని నామ కోరారు.
WhatsApp
Join Now
Youtube
Subscribe