చెరువులు,కుంటలు కాపాడే బాధ్యత ప్రభుత్వానిదే
తెలంగాణ కేసరి గుండాల ఫిబ్రవరి 7
గుండాల మండలం నూనెగూడెం గ్రామ పంచాయతీ నూతన భవన నిర్మాణం కొరకు ఊరకుంట కట్టను కొంత భాగం తొలగించి పంచాయతీ భవన నిర్మాణo చేపడుతున్నారు. అధికారులు స్పందించి వారిపై వాల్టా 2002 చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని గ్రామ మాజీ సర్పంచ్ తూనం రమేష్,సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు మద్దెపురం రాజు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం నూనెగూడెం గ్రామ పంచాయతీ ముందు కుంట కట్టను ధ్వంసం చేయడాన్ని వ్యతిరేకిస్తూ గ్రామ ప్రజలు ధర్నా నిర్వహించారు. గుత్తేదారు గత పదహేను రోజులుగా సర్వే నెంబర్ 390లోని కుంట కట్టను ఆనవాళ్లు లేకుండా ధ్వంసం చేసి ఫిల్లర్ గుంతలు తీసి గ్రామ పంచాయతీ నూతన భవన నిర్మాణాన్ని చేపట్టారు. ఈ విషయాన్ని మండల రెవిన్యూ,ఇరిగేషన్, పంచాయతీరాజ్, జిల్లా కలెక్టర్ లకు ఫిర్యాదు చేసినప్పటికీ పనులు నిలిపివేయడం లేదని అన్నారు. నిర్మాణం పనులు ఆపకపోతే పెద్ద యెత్తున ఆందోళన పోరాటాలతో పాటు న్యాయ పోరాటానికి వెనుకాడమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టిఆర్ యస్ గ్రామశాఖ అధ్యక్షుడు ఆలేటి మల్లారెడ్డి గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు తూనం సతీష్, జిట్ట మల్లేష్, బత్తిని నాగరాజు, ఎగ్గడి నరేష్, బండి సాయి, శ్రీనివాస్ రెడ్డిగన్న రాంరెడ్డి, కాసాని యాదగిరి, పొడిచేటి యాదగియ్య, కారిపోతుల ఐలయ్య తదితరులు పాల్గొన్నారు.