బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విధుల బహిష్కరణ

బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విధుల బహిష్కరణ

తెలంగాణ కేసరి, రామన్నపేట, ఫిబ్రవరి 05

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మొయినాబాద్ లో జరిగిన యువ న్యాయవాది స్వప్న హత్యను నిరసిస్తూ రామన్నపేట కోర్టులో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో
న్యాయవాదులు గురువారం విధులు బహిష్కరించి , నిరసన తెలిపారు.ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఎంఏ .మజీద్ మాట్లాడుతూ…భవిష్యత్తులో న్యాయవాదుల పై ఎలాంటి దాడులు జరగకుండా..తక్షణమే అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురావలసిన అవసరం ఉందని అన్నారు. నిరంతరం అడ్వకేట్ లపై జరుగుతున్న దాడులను అరికట్టాలని కోరారు. ఆస్తి కోసం ఇలాంటి దాడులు, హత్యలు చేయడం అత్యంత హేయమని అన్నారు. ఆస్తి వివాదాల కోసం కోర్టులను ఆశ్రయించాలని కోరారు.స్వప్న ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ మౌనం పాటించారు.ఈ కార్యక్రమము బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు యాదాసు యాదయ్య ,సీనియర్ న్యాయవాదులు జినుకల ప్రభాకర్ , కేమ రామదాసు, బసరాజు అశోక్ కుమార్ , జగతయ్య, శ్రీశైలం ,కూనూరు శ్రీనివాస్, నూతి రమేష్, సతీష్ రెడ్డి ,మణికంఠ తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Youtube Subscribe