సుద్దాల గ్రామంలో తాటి చెట్టు పైనుండి కిందపడి గీత కార్మికుడు మృతి
తెలంగాణ కేసరి వెబ్ డిస్క్ గుండాల జనవరి 27
యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం సుద్దాల గ్రామానికి చెందిన వృత్తి రీత్యా గీత కార్మికుడు రోజువారీగా యమ గాని బక్కయ్య తాటి చెట్టు ఎక్కి ప్రమాదవశాత్తు కిందపడ్డాడు. విషయం తెలిసిన కుటుంబ సభ్యులు పోయేసరికి తీవ్ర గాయాల అవడంతోహుటాహుటిన జనగామ ఏరియా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మృతుడికి భార్య ఇద్దరు కూతుళ్లు కుమారుడు ఉన్నారు. ఈ విషయం తెలిసి గీత కార్మిక జిల్లా నాయకులు మృతుడు యమ గాని బక్కయ్య కుటుంబానికి ఎక్సైజ్ శాఖ అధికారులు వెంటనే స్పందించి ఎక్స్ గ్రేషియా వెంటనే మంజూరు చేయాలని కోరారు. గ్రామ ప్రజలు ఈ విషయంపై వ్యవసాయ అధికారి ఏ ఈ ఏవో స్పందించి రైతుబంధు వచ్చేటట్లు చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
WhatsApp
Join Now
Youtube
Subscribe