ఘనంగా మార్కండేయ స్వామి బ్రహ్మోత్సవాలు
– ప్రత్యేక పూజలు చేసిన మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి
తెలంగాణ కేసరి, వెబ్ డెస్క్ పాటు, రామన్నపేట, జనవరి 25
రామన్నపేట మండలంలోని సిరిపురం గ్రామంలో శ్రీ శివ భక్త మార్కండేయ స్వామి దేవాలయ తృతీయ వార్షిక బ్రహ్మోత్సవాలు మరియు శ్రీ భద్రావతి భావనాఋషి కళ్యాణ మహోత్సవాలు ఆదివారం నాడు వైభవంగా జరిగాయి. ఈ బ్రహ్మోత్సవాలలో నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. తీర్థప్రసాదాలు స్వీకరించిన అనంతరం ఆయన మాట్లాడారు. ఆ భగవంతుని కృపతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని, పాడిపంటలు సమృద్ధిగా పండాలని కోరుకున్నట్లు తెలిపారు.కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అంబటి ఉపేంద్ర రవీందర్ రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ బందెల రాములు, రైతు సమన్వయ సమితి మాజీ మండల అధ్యక్షుడు బొక్క మాధవరెడ్డి, మాజీ సర్పంచ్ ఎడ్ల మహేందర్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ పున్న వెంకటేశం, గ్రామ శాఖ అధ్యక్షుడు బండ శ్రీనివాసరెడ్డి, నాయకులు కూనూరు ముత్తయ్య, ఎడ్ల నరేందర్ రెడ్డి ,లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.