రైతు ఉత్పత్తిదారుల సంస్థ సభ్యత్వ స్వీకరణ
– ముఖ్య అతిథిగా పాల్గొన్న సర్పంచ్ సాయి కుమార్ గౌడ్
తెలంగాణ కేసరి, రామన్నపేట, జనవరి 25
ఎఫ్ పి ఓ (ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్) రైతులకు అందించే సహకారాన్ని సద్వినియోగం చేసుకోవాలని గ్రామ సర్పంచ్ కూనూరు సాయికుమార్ గౌడ్ కోరారు.ఆదివారం నాడు మండలంలోని బోగారం గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో సిఈఓ జంగారెడ్డి తో కలిసి పాల్గొని మాట్లాడారు. సింగిల్ విండో కార్యాలయంలో సభ్యత్వం ఉన్న ప్రతి రైతు తిరిగి మళ్లీ సభ్యత్వం తీసుకోవాలని, తద్వారా ప్రభుత్వం నుండి లభించే సబ్సిడీ పొందాలని , సభ్యత్వం కోసం చెల్లించిన రుసుము తిరిగి మరల రెండింతలుగా ప్రభుత్వం చెల్లిస్తుందని, ప్రతి రైతు సభ్యత్వం తీసుకోవాలని ,కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే సబ్సిడీని పొందాలని తెలిపారు .ఈ కార్యక్రమంలో ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం సిబ్బంది రాములు, రైతులు అంతటి మల్లేశం గౌడ్, ఇప్ప పాండురంగారెడ్డి ,కట్ట దశరథరెడ్డి, కడారి పాపయ్య, నేరటి రమేష్, బైకాని మహేష్, గోగు మహేష్, రైతులు తదితరులు పాల్గొన్నారు.