దాతల సహకారం అభినందనీయం

దాతల సహకారం అభినందనీయం

సర్పంచ్ గర్దాసు విక్రమ్

తెలంగాణ కేసరి వెబ్ డెస్క్, రామన్నపేట, జనవరి 24

దాతలు విద్యార్థులకు విద్యా సామగ్రి పంపిణీ చేయడం అభినందనీయమని గ్రామ సర్పంచ్ గర్దాసు విక్రమ్ అన్నారు. మండలంలోని ఇంద్రపాలనగరం ప్రాథమిక పాఠశాల (గడీలబడి )లో శనివారం 35 మంది విద్యార్థులకు విద్యా సామాగ్రిని సర్పంచ్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ విక్రమ్ మాట్లాడుతూ… గ్రామానికి చెందిన
సింగణబోయిన యశోద జ్ఞాపకార్ధం వారి కుమారుడు సింగణబోయిన కరుణాకర్ యాదవ్ సహకారంతో విద్యార్థులకు సుమారుగా రూ.35 వేల విలువైన టై, బెల్ట్, షూస్ లు ఉచితంగా అందించడం ఎంతో శుభసూచకమని అన్నారు .విద్యార్థులు దాతలు అందించిన విద్యా సామాగ్రిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ నల్లజయసుధ స్వామి, వార్డు సభ్యులు, యువనాయకులు సింగణబోయిన గణేష్ యాదవ్ ,సీనియర్ నాయకులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Youtube Subscribe