భద్రాచలం, పాల్వంచ నుండి మేడారంకు ప్రత్యేక బస్సులు
తెలంగాణ కేసరి వెబ్ డెస్క్ భద్రాచలం జనవరి 24
ఈ నెల 27 నుండి 30వ తేదీ వరకు జరుగు మేడారం సమ్మక్క, సార్లమ్మ జాతర సందర్భంగా టిజిఆర్టీసి భద్రాచలం డిపో నుండి ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు డిపో మేనేజర్ జంగయ్య ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదివారం నుండి ఈ బస్సులు అందుబాటులో ఉంటాయన్నారు. పాల్వంచ బస్ స్టాండ్ నుండి మరియు భద్రాచలం బస్టాండ్ నుండి ఈ ప్రత్యేక బస్సులు నడుస్తాయని ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోగలరని కోరారు. భద్రాచలం నుండి మేడారం వరకు పెద్దలకు టికెట్టు 300 రూపాయలు పిల్లలకు టికెట్టు 150 రూపాయలు మరియు పాల్వంచ నుండి పెద్దలకు టికెట్టు 310 పిల్లలకు టికెట్ 170 రూపాయలు. ఎవరైనా 50 మంది ప్రయాణికులు ఉంటే మీ ఇంటి వద్ద నుండే మేడారంకు బస్సును ఏర్పాటు చేయగలమని తెలియజేశారు. కావున భద్రాచలం చుట్టుపక్కల ప్రాంతాల భక్తులు పాల్వంచ పరిసర ప్రాంతాల భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు 9505198590, 930612253,9553990399, 9885148415 నెంబర్లను సంప్రదించాలని భద్రాచలం డిపో మేనేజర్ జంగయ్య ప్రకటనలో కోరారు.