ప్రమాణ స్వీకారం చేసిన రణమల్ల అనిత శ్రీనివాస్ రెడ్డి

ప్రమాణ స్వీకారం చేసిన రణమల్ల అనిత శ్రీనివాస్ రెడ్డి

 

తెలంగాణ కేసరి గుండాల డిసెంబర్ 22

 

గుండాల మండలం పెద్దపడిశాల గ్రామ సర్పంచిగా రణమల్ల అనిత శ్రీనివాస్ రెడ్డి ఉప సర్పంచ్ వార్డు సభ్యులు కలిసి ప్రమాణ స్వీకారం చేశారు. మండలఎంపిఓ ఎంఏ సలీం, గ్రామ కార్యదర్శి మునావర్ నూతన రణమల్ల అనిత శ్రీనివాసరెడ్డి, మాట్లాడుతూ… గ్రామ ప్రజలు తమపై ఉంచిన విశ్వాసాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వమ్ము చేయబోమని స్పష్టం చేశారు. అభివృద్ధి, సంక్షేమం, పారదర్శక పాలనే తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.గ్రామాల్లో మౌలిక వసతుల మెరుగు పరిచి తాగునీరు, పారిశుద్ధ్యం, రహదారులు, విద్యుత్ సౌకర్యాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల సమర్థవంతమైన అమలుకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు.ప్రతి వార్డుకు సమాన న్యాయం చేస్తూ ప్రజలతో కలిసి నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. యువత మహిళలు రైతులు పేద వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా పనిచేస్తామని తెలుపుతూ మమ్ముల ఆదరించి గెలిపించినందుకు గ్రామ ప్రజలకు సర్పంచ్ రణమల్ల అనిత శ్రీనివాస్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

WhatsApp Join Now
Youtube Subscribe