సర్వేపల్లి గ్రామ సర్పంచ్ గా కల్వకుంట్ల ఉపేందర్ రెడ్డి ప్రమాణ స్వీకారం 
తెలంగాణ కేసరి ఆలేరు నియోజకవర్గ ఇన్చార్జి డిసెంబర్ 22
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గం ఆత్మకూర్ ఎం మండలం సర్వేపల్లి గ్రామ సర్పంచ్ గా కల్వకుంట్ల ఉపేందర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ప్రమాణ స్వీకారానికి ముఖ్యఅతిథిగా తహసిల్దార్ వి.లావణ్య,ఆర్ ఐ.వై మల్లికార్జునరావు హాజరయ్యారు.ఉప సర్పంచ్ గా ఏశబోయిన వెంకటేష్, వార్డు మెంబర్లు పంది మహేష్, జమాన్ల సునీత,మరిపెళ్లి అండాలు,కొమ్ము స్వామి, మచ్చ రాజు,గ్యార నరేష్, భానుపురి మాధవి లు ప్రమాణస్వీకారం చేశారు.ఈ సందర్భంగా కల్వకుంట్ల ఉపేందర్ రెడ్డి మాట్లాడుతూ, గ్రామ అభివృద్ధికై స్థానిక ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య సహాయ సహకారాలతో గ్రామాన్ని మండలంలో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని అన్నారు.ప్రమాణ స్వీకారం అనంతరం సర్పంచ్,ఉప సర్పంచ్,వార్డ్ మెంబర్లను ఎంపీడీవో రాములు నాయక్,సూపరిండెంట్ లోకేశ్వర్ రెడ్డి,జూనియర్ అసిస్టెంట్ ప్రదీప్,పంచాయతీ కార్యదర్శి ఇంజ నరేష్, కారోబార్ పంది స్వామి సన్మానించారు.ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.