కాంగ్రెస్ నుండి బిఆర్ఎస్ లో చేరిక

కాంగ్రెస్ నుండి బిఆర్ఎస్ లో చేరిక

కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి

తెలంగాణ కేసరి, వెబ్ డెస్క్, రామన్నపేట, నవంబర్ 30

మండలంలోని కక్కిరేణి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు సోమనబోయిన రవి ఆధ్వర్యంలో పలువురు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సమక్షంలో ఆదివారం బిఆర్ఎస్ పార్టీలో చేరారు.ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ బిఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా సోమనబోయిన రవిని ఎంపిక చేయగా మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆయన అభ్యర్థిత్వాన్ని అధికారికంగా ప్రకటిస్తూ అభినందనలు తెలియజేశారు.గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పార్టీ నాయకులు సమిష్టిగా పనిచేసి సర్పంచ్ తో పాటు వార్డు సభ్యులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన సూచించారు. పార్టీలో చేరిన వారిలో మాజీ ఎంపిటిసి బల్లెం నర్సింహ, సీనియర్ నాయకులు ముద్రబోయిన శ్రీశైలం, కన్నెబోయిన శ్రీను, కన్నెబోయిన శేఖర్, పోగుల వెంకటయ్య మరియు పలువురు కాంగ్రెస్ నాయకులు బిఆర్ఎస్ పార్టీలో చేరారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు పోషబోయిన మల్లేశం, మాజీ సర్పంచ్ పిట్టె కృష్ణారెడ్డి, మాజీ ఉపసర్పంచ్ ముప్పిడి దయాకర్, గ్రామ శాఖ కార్యదర్శి గుండాల మల్లేశం, నాయకులు ముక్కామల శ్రీను, కిన్నెర మహేష్, కన్నెబోయిన మల్లేశం, నల్ల యాదయ్య, నల్ల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Youtube Subscribe