అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి

అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి

యాదవ విద్యా వంతుల వేదిక జిల్లా అధ్యక్షులు కొత్తపల్లి ఆనంద్ యాదవ్

తెలంగాణ కేసరి, వెబ్ డెస్క్, యాదాద్రి భువనగిరి, నవంబర్ 30

స్థానిక ఎన్నికల్లో యాదవులు ముందుండాలని, వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని యాదవ విద్యా వంతుల వేదిక జిల్లా అధ్యక్షులు కొత్తపల్లి ఆనంద్ యాదవ్ కోరారు. ఈ సందర్భంగా ఆదివారం నాడు భువనగిరిలో మీడియాతో మాట్లాడుతూ… జిల్లాలోని 17 మండలాల యాదవ సంఘం నాయకులు, సోదర సోదరీమణులు సర్పంచ్ మరియు వార్డు సభ్యులుగా పోటీ చేసి విజయం సాధించాలని ఆయన ఆకాంక్షించారు.

యాదవ ప్రచార రథాన్ని ఏర్పాటు చేస్తాం….

కాంగ్రెస్, బిజెపి, బిఆర్ఎస్,సిపిఎం సిపిఐ మరియు స్వతంత్ర అభ్యర్థులుగా స్థానిక ఎన్నికల్లో పార్టీలకతీతంగా పోటీ చేసిన యాదవులందరికీ యాదవ ప్రచార రథాన్ని ఏర్పాటు చేయనున్నట్లు యాదవ విద్యా వంతుల వేదిక జిల్లా అధ్యక్షులు కొత్తపల్లి ఆనంద్ యాదవ్ తెలిపారు.వివిధ జిల్లాల, మండల ముఖ్య నాయకులతో చర్చించి కార్యచరణ ఏర్పాటు చేసుకొని పార్టీలకతీతంగా మన యాదవులు సర్పంచ్ మరియు వార్డ్ సభ్యులుగా నామినేషన్ వేసిన ప్రాంతానికి వచ్చి ప్రచారాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు.యాదవ సోదరులంతా ఒక తాటిపైకి వచ్చి పార్టీలకతీతంగా యాదవులు ఎక్కడ పోటీ చేస్తున్నా సహకరించి గెలుపు దిశగా కార్యచరణ ఏర్పాటు చేసుకోవాలని ఆయన సూచించారు.రాజ్యాధికారంతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని భావించి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందని, అందుకు ప్రతి ఒక్క యాదవ కుటుంబ సభ్యులు సహకరంచాలని ఈ సందర్భంగా ఆయన కోరారు.

WhatsApp Join Now
Youtube Subscribe