వాటర్ ట్యాంక్ నిర్మించిన పిఎసిఎస్ వైస్ చైర్మన్ ఉపేంద్ర రవీందర్ రెడ్డి
తెలంగాణ కేసరి, వెబ్ డెస్క్, రామన్నపేట, నవంబర్ 23
మండలంలోని సిరిపురం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఎదురుగా ప్రజలు, రైతుల సౌకర్యార్థం పిఎసిఎస్ వైస్ చైర్మన్ అంబటి ఉపేంద్ర రవీందర్ రెడ్డి తన సొంత నిధులు రూ.80 వేలు వెచ్చించి నిర్మించిన వాటర్ ట్యాంకును నిర్మించారు.ఆదివారం నాడు రైతులు, గ్రామ ప్రజలతో కలిసి అంబటి ఉపేంద్ర రవీందర్ రెడ్డి ప్రారంభించి, రైతులకు అంకితం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 13 వేల లీటర్ల సామర్థ్యం కలిగిన ఈ వాటర్ ట్యాంక్ ప్రజలకు, రైతులకు, విద్యార్థులకు, బాటసారులకు ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు.దీనిని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. గ్రామంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించడానికి ఒక ప్రణాళిక బద్ధంగా ముందుకు సాగుతున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ పున్న వెంకటేశం, నాయకులు కునూరు ముత్తయ్య, బండ శ్రీనివాసరెడ్డి, అంబటి యాదిరెడ్డి, దాసిరెడ్డి శ్రవణ్ కుమార్ రెడ్డి, పొలపాక క్రిష్ణ, కునూరు రమేష్, లింగస్వామి, అప్పం శ్రీరాములు, మాండ్ర కిష్టయ్య, సంగిశెట్టి సత్యనారాయణ, కట్ట నరసింహారెడ్డి, కూనూరు శివ రాంప్రసాద్, దేవేంద్రమ్మ, బెల్లంకొండ దుర్గమ్మ, మోటె కలమ్మ, రైతులు తదితరులు పాల్గొన్నారు.