ఇడెం స్వరూప సేవా సంస్థ సేవలు ప్రశంసనీయం

ఇడెం స్వరూప సేవా సంస్థ సేవలు ప్రశంసనీయం

-తాజా మాజీ సర్పంచ్ ఎడ్ల మహేందర్ రెడ్డి

తెలంగాణ కేసరి, వెబ్ డెస్క్, రామన్నపేట, నవంబర్ 23

మండలంలోని వెల్లంకి గ్రామంలో ఇడెం స్వరూప స్మారక సేవా సంస్థ ఆధ్వర్యంలో పేద ప్రజలకు చేస్తున్న సేవలు ప్రశంసనీయమని బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు,వెల్లంకి తాజా మాజీ సర్పంచ్ ఎడ్ల మహేందర్ రెడ్డి అన్నారు. ఆదివారం నాడు గ్రామంలో సంస్థ అధ్యక్షులు ఇడెం రాధా శ్రీనివాస్ రెండు లక్షల రూపాయలతో సమకూర్చిన 20 లీటర్ల సామర్థ్యం కలిగిన డ్రింకింగ్ వాటర్ క్యాన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఇడెం స్వరూప సేవా సంస్థ అధ్యక్షులు ఇడెం రాధా శ్రీనివాస్ మాట్లాడుతూ… గ్రామ అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు పున్న వెంకటేశం, కార్యదర్శి పిట్ట మహేందర్ రెడ్డి, మాజీ గ్రామ శాఖ అధ్యక్షుడు ఎడ్ల నరేందర్ రెడ్డి, ఎడ్ల కృష్ణారెడ్డి, తలారి నరసింహ, గంజి రంగయ్య, సండ్ల నరసింహ తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Youtube Subscribe