జిల్లా స్థాయి అవార్డు అందుకున్న నాయిని కృష్ణ మూర్తి
తెలంగాణ కేసరి, వెబ్ డెస్క్ యాదాద్రి భువనగిరి నవంబరు 20
తాపీ కార్మికుల సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా పని చేస్తున్న మహాత్మాగాంధీ తాపీ కార్మిక లేబర్ కాంట్రాక్టు సహకార సంఘానికి జిల్లా స్థాయి అవార్డు దక్కింది. గురువారం హైదరాబాద్ లోని బషీర్బాగ్ లో నిర్వహించిన 72వ అఖిల భారత సహకార వారోత్సవాల్లో భాగంగా భువనగిరి జిల్లా కేంద్రంలోని మహాత్మాగాంధీ తాపీ వర్కర్ సంఘం గౌరవాఅధ్యక్షుడు నాయిని కృష్ణ మూర్తికి ఉమ్మడి నల్లగొండ జిల్లా డీసీసీబీ అధ్యక్షుడు కుంభం శ్రీనివాస్ రెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లా కో ఆపరేటివ్ జిల్లా అధికారి శ్రీధర్ చేతుల మీదుగా ఆయన అవార్డు అందుకున్నారు. జిల్లా స్థాయి ఆవార్డు తమ సంఘానికి దక్కడం పట్ల సంఘం అధ్యక్షుడు బర్రె నగేష్, ఉపాధ్యక్షుడు వడ్డెపల్లి దాసు, కార్యదర్శి తోటకూరి రమేశ్, బొడ్డు రవీందర్,పెళువర్తి వెంకటయ్య,వల్లపు కృష్ణ, గళ్ళ కృష్ణ,నీలం వెంకటేష్, కుంభం నాగరాజులు హర్షం వ్యక్తం చేశారు.