బాధిత కుటుంబానికి అండగా నిలిచిన సింగిల్ విండో వైస్ చైర్మన్
తెలంగాణ కేసరి వెబ్ డెస్క్ రామన్నపేట నవంబర్ 09
మండలంలోని సిరిపురం గ్రామానికి చెందిన చలమల్ల శ్రీనివాస్ ఇటీవల అకస్మాత్తుగా మృతి చెందాడు.ఆయన కుటుంబ సభ్యులను శనివారం సింగిల్ విండో వైస్ చైర్మన్ అంబటి ఉపేంద్ర రవీందర్ రెడ్డి పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు.ఆధ్యైర్య పడవద్దు అండగా ఉంటామని మనోధైర్యం కల్పించారు. అనంతరం రూ.10 వేలు ఆర్థిక సహాయాన్ని అందజేశారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిటిసి పున్న వెంకటేశం, మాజీ ఉప సర్పంచ్ దాసిరెడ్డి శ్రవణ్ కుమార్ రెడ్డి, నాయకులు బండ శ్రీనివాస్ రెడ్డి, కూనూరు ముత్తయ్య, అంబటి యాదిరెడ్డి, దోర్నాల శ్రీరాములు, సిలువేరు లక్ష్మయ్య, కూనూరు రమేష్ తదితరులు పాల్గొన్నారు.
WhatsApp
Join Now
Youtube
Subscribe