వందేమాతర గీతం దేశ జాతీయ భావాలకు నిదర్శనం
150 వసంతాలు పూర్తి
తెలంగాణ కేసరి, వెబ్ డెస్క్, గుండాల, నవంబర్ 7
యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలో పలు ప్రభుత్వ కార్యాలయంలో మండల పరిషత్ కార్యాలయంలో వందేమాతరం జాతీయగీతం 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా భారతదేశ ఔనత్యానికి జాతీయ భావాలకు వందేమాతరం గీతం నిదర్శనం అన్నారు. అధికారులు ప్రతిజ్ఞ చేశారు. ఇందులో పాల్గొన్న అధికారులు ఎంపీ ఓ ఎంఏ సలీం సూపరిండెంట్ డి మల్లయ్య సీనియర్ అసిస్టెంట్ దేవేందర్ పంచాయతీ కార్యదర్శి మునావర్ ప్రశాంత్ యాదగిరి నబి పాల్గొన్నారు. గుండాల బస్ సెంటర్లో వందేమాతరం గీతాలాపనలో విద్యార్థులతో పాల్గొన్న
ఎస్సై ఎం తేజం రెడ్డి పాల్గొన్నారు. హై స్కూల్ లో పాల్గొని ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ వందేమాతర గీతం భారత దేశ మానవాళికి సమానత్వ భావాలకు నిదర్శనమని అన్నారు. అందరూ దేశభక్తిని పెంపొందించుకోవడానికి అలవర్చుకోవాలని అన్నారు. నాటి నుండి నేటి వరకు మాతృదేవోభవ అంటూ అమ్మలోని గొప్పతనాన్ని యావత్ ప్రపంచానికి తెలియజేసిన సంస్కృతి మనదని అన్నారు. ఆటలోనైనా అంతరిక్ష అంతరిక్ష ప్రయోగంలోనైనా ఏ రంగంలోనైనా అంతర్జాతీయ స్థాయిలో మన దేశం గెలిచినప్పుడు ప్రతి భారతీయుడి హృదయ గీతం వందేమాతరం అవుతుందని అన్నారు. విద్యార్థి దశ నుండి విద్యావంతులు అధికారుల వరకు అందరికీ చెరగని గీతం వందేమాతర గీతం అని ఎస్సై తేజం రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమం పాల్గొన్న కాంప్లెక్స్ స్కూల్ హెడ్మాస్టర్ జి చంద్రకళ ఉపాధ్యాయులు పోలీస్ సిబ్బంది ఏ ఎస్ రెడ్డి సైదులు జాంగిర్ యువకులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.