పూర్వ విద్యార్థినికి ఘన సన్మానం..

పూర్వ విద్యార్థినికి ఘన సన్మానం..

తెలంగాణ కేసరి, వెబ్ డెస్క్, రామన్నపేట, నవంబర్ 08

రామన్నపేట మండల కేంద్రంలోని వివేకానందాస్ డివైన్ మోడల్ స్కూల్ పూర్వ విద్యార్థిని, డాక్టర్ తిరుగుడు సాయి హర్షిత తాజాగా ప్రకటించబడిన పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ మెడిసిన్ ఫలితాల్లో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని పాఠశాల ఉపాధ్యాయులు ఆమెను శుక్రవారం ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా పాఠశాల వ్యవస్థాపకులు తిరుగుడు మల్లికార్జున్ మాట్లాడుతూ..హర్షిత చిన్ననాటి నుంచే పట్టుదల, కృషి, నిబద్ధతతో చదవడం కాకుండా విలువల పరంగా కూడా ఇతర విద్యార్థులకు ఆదర్శంగా నిలిచిందని తెలిపారు. ఆమె డాక్టర్ వృత్తిలో ప్రజలకు సేవచేసి, సమాజానికి తోడ్పడాలని ఆకాంక్షించారు.హర్షిత తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఆమెను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు అస్మ,మల్లేష్ నాగరాజు, విద్యాసాగర్, ముత్యాలు, సుధారాణి, సునీత, మాధురి,పారిజాత, సరిత, సాయి, అనిత, అస్మతునిస మొదలగు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Youtube Subscribe